హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-శ్రీలంక తొలి టెస్టుకు వర్షం ముప్పు

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ పేర్కొంది. అలాగే, గంటకు 20-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నాయని అంచనా వేసింది. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ సెషన్ వాతావరణం అనుకూలించక రద్దయింది. దీంతో ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు.