హైదరాబాద్: 28°C
క్రీడలు

ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి?

శ్రీలంక-భారత్ మధ్య రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. గాలే పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. దీంతో టీమిండియా ముగ్గురు ఎడమచేతి స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సవాలేనని బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపాడు. పేసర్లలో సిరాజ్‌కు తోడుగా ఇంకో బౌలర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేమని, పిచ్ తీరును బట్టి నిర్ణయం తీసుకుంటామన్నాడు.