NLG: దేవరకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బాలునాయక్ హాజరయ్యారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులు, మున్సిపల్ సభ్యులతో సమీక్షించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా సరిగ్గా ఉండాలన్నారు.
వార్తలు
'మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష'


