హైదరాబాద్: 28°C
క్రీడలు

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న రొనాల్డో

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, మోడల్ జార్జినా రోడ్రిగ్స్‌ వివాహం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. భవిష్యత్తులో ఒకరి ఆస్తుల విషయంలో మరొకరు జోక్యం చేసుకోకూడదని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో వీరు విడిపోయినా ఏ సమస్య రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారట. కాగా, వీరికి ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్నారు.