హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే ఇలా చేస్తే.. రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు!

ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఆ తర్వాత కొద్దిసేపు ప్రాణాయామం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు. ఉదయం పూట తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.