హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు రాలే సమస్యకు చెక్..!

జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి కేవలం షాంపూలు సరిపోవు, లోపలి నుండి ప్రొటీన్లు అందాలి. దీనికోసం గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయాబీన్స్‌ను నిత్యం తీసుకోవాలి. కరివేపాకు, ఉసిరిలో ఉండే ఐరన్, బయోటిన్ జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను దృఢంగా చేస్తాయి. రసాయనాలతో కూడిన హెయిర్ డైలు, మితిమీరిన వేడితో కూడిన స్టైలింగ్ టూల్స్ వాడకం తగ్గించాలి.