హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్న BCCI

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటనపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. BCBతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి రాగానే షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని వెల్లడించాయి.