హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెటర్‌తో పెళ్లి.. బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ

ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఆఫ్తాబ్ ఆలామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై హిందీ బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ క్లారిటీ ఇచ్చింది. ఆఫ్తాబ్ తనకు 2020 నుంచి తెలుసని, తాము మంచి స్నేహితులమని పేర్కొంది. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఆఫ్తాబ్‌కు ఇప్పటికే వివాహం అయిందని, అతనికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించింది.