హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా లేకపోతే సిరాజ్ మరింత డేంజర్..!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరమవడంతో, బౌలింగ్ విభాగానికి సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే, బుమ్రా లేని సమయాల్లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో చెలరేగుతుండటం విశేషం. బుమ్రాతో కలిసి ఆడిన 29 టెస్టుల్లో సిరాజ్ 90 వికెట్లు తీయగా.. బుమ్రా లేని సమయంలో 17 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు కూడా సిరాజ్ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.