హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీపై సుశాంత్ సింగ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

ఎంఎస్ ధోనీపై సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు మరణిస్తే ధోనీ కనీసం చూడటానికి కూడా రాలేదని, తమ కుటుంబ సభ్యులను పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా అమెరికాలో ఉన్న తాను.. సోదరుడిని చివరి చూపు చూడలేకపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, 'MS ధోనీ' చిత్రంలో సుశాంత్ సింగ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.