హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా గాయాలు ఆందోళనకరం: బద్రీనాథ్

బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలపై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఫిట్‌నెస్ విషయంలో బోర్డు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రపంచకప్ ముందు అతడు ఇలా వరుసగా గాయాలతో జట్టుకు దూరం కావడం ఆందోళనకరమని పేర్కొన్నాడు.