హైదరాబాద్: 28°C
క్రైమ్

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ముగ్గురు మృతి

TG: నిజామాబాద్ జిల్లా గోవింద్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సులోని మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన మాధవి, సుజాతగా పోలీసులు గుర్తించారు. కిన్వాట్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.