హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రతిసారీ గంభీర్‌ను నిందించడం సరికాదు: హర్భజన్‌

హర్భజన్‌ సింగ్‌ గౌతమ్‌ గంభీర్‌పై వస్తున్న విమర్శలను ఖండించాడు. మ్యాచ్‌ లేదా సిరీస్‌ ఓడిన ప్రతిసారీ కోచ్‌ను నిందించడం సరికాదన్నాడు. గంభీర్‌ ముక్కుసూటి వ్యక్తి అని, నిజాలను నిక్కచ్చిగా మాట్లాడతాడని ప్రశంసించాడు. విజయం కోసమే ఆడాలని గంభీర్‌ బలంగా నమ్ముతాడని, ఓటమిని, డ్రాను కూడా ఇష్టపడడని హర్భజన్‌ పేర్కొన్నాడు.