హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కార్వేటినగరంలో ఎమ్మెల్యే పర్యటన

CTR: కార్వేటినగరం మండలంలో ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వి.ఎం.థామస్ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమ్మపల్లి క్రాస్ వద్ద అంగన్వాడీ ఆయా పోస్టుల నియామక పత్రాల పంపిణీ, వెయ్యి ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పోలీసులతో కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొని, స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం మొక్కలు నాటనున్నారు.