హైదరాబాద్: 28°C
వ్యాపారం

గూగుల్‌ ఏఐ రేసును నడపనున్న సెర్గీ బ్రిన్‌

గూగుల్‌ ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ రేసులో గూగుల్ వెనుకబడటంతో ఆయన స్వయంగా రంగంలోకి వచ్చి, జెమినీ ఏఐ మోడల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఇంజినీర్లకు ప్రోత్సాహాన్నీ అందిస్తున్నారు. ఓపెన్‌ ఏఐ, ఆంథ్రోపిక్‌ సంస్థలను లక్ష్యంగా చేసుకుని గూగుల్ ఈ పోటీని తీవ్రతరం చేసింది.