హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫుడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లకు FSSAI వార్నింగ్‌

ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్లకు FSSAI వార్నింగ్ ఇచ్చింది. ఆహార ఉత్పత్తులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలను హెచ్చరించింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ప్రచారంతో పాటు బాధ్యత కూడా ఉండాలని ఇన్‌ఫ్లూయెన్సర్లకు FSSAI సూచించింది.