హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి: గావాస్కర్

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించాల్సిందే. సొంతగడ్డపై శ్రీలంకను ఓడించడం సవాలే అయినా, టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో సునీల్ గావాస్కర్ కీలక సూచనలు చేశారు. ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.