హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రావణ శోభకు ముస్తాబవుతున్న ఆలయాలు

కోనసీమ: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భక్తుల రాక కోసం ముస్తాబవుతున్నాయి. వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, కృష్ణాష్టమి వంటి పండుగలతో శ్రావణమాసం అంతటా ప్రధాన ఆలయాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. వాడపల్లి, అయినవిల్లి, అప్పనపల్లి, మురముళ్ళ, అంతర్వేది ఆలయాలలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు.