హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ కోచ్ పదవికి ముప్పు!

వరుస పరాజయాలతో గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆయనను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించే ఆలోచన బీసీసీఐకి లేదని సమాచారం. రాబోయే పర్యటనల్లో జట్టు ప్రదర్శనను మెరుగుపరచేందుకు గంభీర్‌కు మరింత సమయం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక సిరీస్‌లలో ఫలితాల ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.