హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈ-కామర్స్ సంస్థలపై ఫిర్యాదుల వెల్లువ

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషోపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. అత్యధికంగా ఫ్లిప్‌కార్ట్‌పై 1.33 లక్షలు, అమెజాన్‌పై 91 వేల కంప్లైంట్స్ రాగా, వస్తువుల డెలివరీ సమస్యలపైనే 79,818 ఫిర్యాదులందాయని కేంద్రమంత్రి BL వర్మ తెలిపారు. తప్పులకి పాల్పడిన 47 సంస్థలకు ఏకంగా రూ.1.12 కోట్ల జరిమానా విధించామన్నారు.