హైదరాబాద్: 28°C
వ్యాపారం

కనుమరుగవుతున్న బడ్జెట్ ఫోన్లు!

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి షాక్. మార్కెట్లో రూ.10 వేల లోపు బడ్జెట్ ఫోన్లు కనుమరుగవుతున్నాయి. ఏఐ బూమ్ వల్ల మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో తయారీ కంపెనీలు ఫోన్ల ధరలు పెంచుతున్నాయి. ఐడీసీ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎంట్రీ-లెవల్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 74 శాతం మేర క్షీణించడం గమనార్హం.