హైదరాబాద్: 28°C
వ్యాపారం

చంద్రశేఖరన్ ఎఫెక్ట్.. కుంగిన టాటా స్టాక్స్

టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి N.చంద్రశేఖరన్ వైదొలగుతున్నారన్న ప్రకటనతో దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 613 పాయింట్లు పతనమై 77,540కి, నిఫ్టీ 190 పాయింట్లు క్షీణించి 24,279కి పడిపోయాయి. చంద్రశేఖరన్ నిర్ణయంతో టాటా గ్రూప్ షేర్లు భారీగా కుంగాయి. TCS షేర్లు 6% పతనమై రూ.2,301 కనిష్టానికి పడిపోగా, టాటా మోటార్స్ 4.11%, టాటా కన్జూమర్, పవర్ షేర్లు 3% క్షీణించాయి.