హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘యువతను చూస్తే నా కథే గుర్తొస్తుంది’

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ముంబైకి వెళ్లిన రోజులను స్మరించుకున్నారు. ఎన్నో కలలతో తమ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి వచ్చే యువతను చూస్తుంటే తన సొంత కథే గుర్తొస్తుందన్నారు. కఠోర శ్రమ, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపనే తనను ఇంత దూరం నడిపించిందని స్పష్టం చేశారు.