హైదరాబాద్: 28°C
వార్తలు

మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి తూమాటి మాధవరావు

GNTR: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ తరపున తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్‌.. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా మద్దతు ఇవ్వాలని సూచించారు.