హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకలో సెలూన్‌ షాప్ తెరిచిన సిరాజ్!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడిపారు. సెలూన్‌కు వెళ్లిన సర్ఫరాజ్ ఖాన్‌కు మహమ్మద్ సిరాజ్ ట్రిమ్మర్‌తో హెయిర్‌కట్ చేసేందుకు ప్రయత్నించాడు. సిరాజ్ సరదా చేష్టలతో సర్ఫరాజ్ పరుగులు తీయగా, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కూడా నవ్వుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.