హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐకి కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల ఇబ్బందులకు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటమూ కారణమని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. టెస్టు క్రికెట్ కోసం దేశవాళీ అనుభవం ఎంతో అవసరమన్నారు. టీ20లు, వన్డేలు పెరగడంతో ఫాస్ట్ బౌలర్ల పనిభారంపైనా బీసీసీఐ దృష్టి పెట్టాలని కోరారు.