అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లను బలపరుస్తాయి. రెండు చెంచాల అవిసె గింజల పొడిలో తగినన్ని నీళ్లు కలిపి జెల్ లా చేయాలి. దానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు కుదుళ్లకు పట్టించి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది.
ఆరోగ్యం
జుట్టు ఆరోగ్యానికి.. అవిసె గింజల ప్యాక్!


