హైదరాబాద్: 28°C
వార్తలు

కంటి వెలుగు వెనుక కథ ఇదే: కేటీఆర్

HYD: కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లికి వెళ్తూ లక్ష్మాపురంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. పేపర్ చదవమని అడిగితే చూపు సరిగా లేక ఇబ్బందిపడ్డారని చెప్పారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.