హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మయూరాసనం వల్ల కలిగే ఉపయోగాలు

మయూరాసనం(నెమలి భంగిమ) ఉదరాన్ని మోచేతులతో నొక్కడం వల్ల జీర్ణ అవయవాలు ఉత్తేజితమై మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. ఉదర కండరాల పనితీరు మెరుగై రక్తంలోని మలినాలు, వ్యర్థాలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. మణికట్టు, ముంజేతులు, భుజాలు, వెన్నెముక దృఢంగా మారుతాయి. పొత్తికడుపు కండరాలు బలపడి శరీర బ్యాలెన్స్, సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి.