హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వజ్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

భోజనం తర్వాత చేయదగిన ఏకైక ఆసనం వజ్రాసనం. కడుపు భాగానికి రక్తప్రసరణ అంది, అజీర్ణం, మలబద్ధకం తొలగిపోతాయి. నడుము, వెన్నుముక బలంగా మారుతాయి. దిగువ వెన్నునొప్పి తగ్గుతుంది.  ఏకాగ్రతను పెంచి, ధ్యానానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. స్త్రీలలో వచ్చే నెలసరి నొప్పులను, తిమ్మిర్లను తగ్గిస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.