హైదరాబాద్: 28°C
వార్తలు

చీరాలలో కవలలకు జన్మనిచ్చిన తల్లి

BPT: చీరాల ఏరియా వైద్యశాల గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో అరుదైన ప్రసవం విజయవంతమైంది. పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన హెబ్సిబాకు మొదటి ప్రసవంలో సిజేరియన్ జరగ్గా, రెండోసారి డాక్టర్ సునీత బృందం ప్రత్యేక పర్యవేక్షణలో సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) ద్వారా కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లి, ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.