TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగారం వెస్ట్ బీట్‌లో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్ నవీన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. అడవి జంతువుల వేటకోసం ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చును గుర్తిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
విషాదం.. అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మృతి


