TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా యువకుడు మృతిచెందాడు. హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి(29) 15 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. 2023లో భరత్ అమెరికా వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
క్రైమ్
అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడి మృతి


