హైదరాబాద్: 28°C
క్రీడలు

BCCIతో పనిచేస్తే వారికే లాభం: కైఫ్

టీమిండియాలో స్పోర్ట్స్‌ సైన్స్‌ నిపుణుల కొరతపై భారత మాజీ ప్లేయర్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCIతో పనిచేయడానికి నిపుణులు ముందుకు రావడంలేదని లక్ష్మణ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 'BCCI ప్రపంచంలోనే ధనిక బోర్డు. ఫిజియోథెరపిస్ట్‌లు, మెడికల్ ప్రొఫెషనల్స్‌ మనతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తే వారికే మంచిది. వారు పెద్ద మొత్తం సంపాదించొచ్చు' అని అన్నారు.