హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత వృద్ధి రేటు 8 శాతం!: SBI రీసెర్చ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని SBI రీసెర్చ్‌ అంచనా వేసింది. RBI అంచనా 7% కంటే ఇది 1% ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు ప్రస్తుతం ఆశాజనక ఫలితాలను చూపిస్తున్నాయని SBI రీసెర్చ్ తాజా నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ గమనాన్ని సూచించే 50 గణాంకాల్లో.. 86% గతం కంటే వేగంగా వృద్ధి చెందాయని పేర్కొంది.