హైదరాబాద్: 28°C
క్రైమ్

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి

TG: సంగారెడ్డిలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నారు. మరో వైపు కోహిర్ మండలం కవేలిలో వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది.