హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

హైదరాబాద్‌లోని MTAR EOU కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని BRTU ఆధ్వర్యంలో లేబర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వేతనాలు పెంచాలని, తాత్కాలిక కార్మికులను పర్మినెంట్ చేయాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని BRTU రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRTU గద్వాల జిల్లా బాధ్యులు గంజిపేట రాజు పాల్గొన్నారు.