హైదరాబాద్: 28°C
క్రీడలు

సౌతాఫ్రికా జట్టుకు కొత్త కెప్టెన్

సౌతాఫ్రికా జట్టు త్వరలో నమీబియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్లు బవుమా, మార్‌క్రమ్‌లకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో బ్యోర్న్ ఫోర్టుయిన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్ రౌండర్ మార్కో యాన్‌సన్ కవల సోదరుడైన డువాన్ యాన్‌సన్ తొలిసారిగా సఫారీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.