హైదరాబాద్: 28°C
వ్యాపారం

లలితా జువెలరీ మార్ట్‌ IPO రెడీ

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ ఐపీవో(తొలి పబ్లిక్ ఆఫర్) ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ ఐపీవో ద్వారా మార్కెట్ నుంచి రూ.1,700 కోట్లను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఈ ఐపీవోతో కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.11,250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.