హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పత్తి రైతులకు క్షేత్రస్థాయిలో AEO సూచనలు

SRD: పత్తి పంటలో అధిక నత్రజని వల్ల పూత, కాత ఆలస్యం అవుతుందని AEO సంతోష్ తెలిపారు. మంగళవారం కంగ్టి మండలం నాగూర్ బి గ్రామంలో పత్తి రైతులకు క్షేత్రస్థాయిలో తగు సూచనలు సలహాలు ఇచ్చారు. పత్తి పంటలో అధికంగా యూరియా వాడరాదన్నారు. అధిక నత్రజనితో మొక్క ఎదుగుదల బాగున్నా సరైన సమయానికి పూత, కాత ఆలస్యమై దిగుబడిపై ప్రభావం పడుతుందని చెప్పారు.