హైదరాబాద్: 28°C
వ్యాపారం

నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 319 పాయింట్లు పతనమై నష్టాల్లో ట్రేడవుతుండగా, జాతీయ సూచీ నిఫ్టీ కూడా 87 పాయింట్లు కుంగిపోయింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ 8 పైసల మేర క్షీణించింది. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.