హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఏడుపు బలహీనత కాదు!

ఏడవడం బలహీనతకు సంకేతం కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడి, భావోద్వేగాలను విడుదల చేసుకునే సహజ ప్రక్రియ. మనసులో బాధను అణచిపెట్టడం కంటే కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల భావోద్వేగ భారం కొంత తగ్గుతుంది. ఏడ్చిన తర్వాత మనసు తేలికగా అనిపించవచ్చు. అందుకే ఏడుపును తప్పుగా చూడకుండా, భావాలను సహజంగా వ్యక్తపరచుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.