హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీ డైట్‌లో ఇవి తప్పనిసరి..!

రోగనిరోధక శక్తి పెరగడానికి, జీర్ణక్రియ సాఫీగా సాగడం ఎంతో అవసరం. ఇందుకోసం పీచు పదార్థం ఎక్కువగా ఉండే ముడి బియ్యం, ఓట్స్, తాజా కూరగాయలు, పండ్లను నిత్యం తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు జీర్ణశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తాయి. మైదా పిండితో చేసిన పదార్థాలు, అధిక కారం, వేపుళ్లకు దూరంగా ఉండటం, తగినంత నీరు తాగడం జీర్ణాశయానికి శ్రేయస్కరం.