హైదరాబాద్: 28°C
క్రీడలు

6 బంతుల్లో 6 సిక్సర్లు!

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మెట్రో బ్యాంక్ వన్ డే కప్‌లో హాంప్‌షైర్ బ్యాటర్ టోబీ ఆల్బర్ట్ సంచలనం సృష్టించాడు. వరుసగా తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 6భారీ సిక్సర్లు బాదాడు. ఈ ఘనతను ఒకే ఓవర్‌లో కాకుండా రెండు వేర్వేరు ఓవర్లలో సాధించాడు. 21పరుగుల వద్ద లైఫ్ లభించడంతో దానిని సద్వినియోగం చేసుకున్న ఆల్బర్ట్.. కేవలం 37 బంతుల్లోనే 86 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.