హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు స్పిన్ సెలక్షన్ సెగ!

ఈనెల 15 నుంచి శ్రీలంకతో జరగే తొలి టెస్టుకు గాలె పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారనుంది. దీంతో తుది జట్టు ఎంపిక భారత మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. సీనియర్లు జడేజా, కుల్‌దీప్‌ల స్థానాలు ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ రేసులో మానవ్ సుతార్ ముందున్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి ఎంతమంది స్పిన్నర్లను ఆడించాలనేది మ్యాచ్ ముందే తేలుస్తామని కోచ్ సాయిరాజ్ చెప్పారు.