హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సుప్త వీరాసనం వల్ల కలిగే ఉపయోగాలు

సుప్త వీరాసనం చేయడం వలన కాళ్ల కండరాలు సాగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెన్నెముక బలపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి విశ్రాంతినిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. తొడలు, మోకాళ్లు, మడమలు, కటి భాగంలోని కండరాలు బాగా సాగుతాయి. ఉదర భాగంలోని అవయవాలను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. ఛాతీ భాగం విస్తరించి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.