హైదరాబాద్: 28°C
వార్తలు

కిన్నెరసానికి పర్యాటకుల సందడి..!

BDK: పాల్వంచ మండలం కిన్నెరసాని పార్కులో ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ప్రభుత్వానికి రూ.76,070 ఆదాయం సమకూరింది. 773 మంది పర్యాటకులు కిన్నెరసానికి ప్రవేశించగా రూ.34,850, సఫారీ వాహనాల ద్వారా రూ.14,450 ఆదాయం లభించినట్లు వైల్డ్ లైఫ్ సిబ్బంది తెలిపారు. 430 మంది బోటింగ్ చేయగా టూరిజం శాఖకు రూ.26,770 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.