MHBD: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి కోరారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొర్రూరు డివిజన్ పరిధిలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కోసం వెల్ నెస్ ఏర్పాటు చేయాలని, విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణ పనులకు సహకరించాలని కోరారు.
వార్తలు
'విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


