హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs BAN.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ..!

టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా ప్రతిష్ఠాభిమం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టూర్‌పై త్వరలో భారత ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. సెప్టెంబరులో జరగాల్సిన ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌పై స్పష్టత కోసం బీసీబీ లేఖ రాసిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.