హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక

శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. గాయం కారణంగా బ్యాటర్ సాయిసుదర్శన్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. సర్ఫరాజ్‌ త్వరలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టుకు గాలె, రెండో టెస్టుకు కొలంబో ఆతిథ్యమివ్వనున్నాయి.